తెలంగాణ

telangana

ETV Bharat / sports

'భారత బౌలర్ల ఉచ్చులో పడిపోయాం'

మెరుగైన బౌలింగ్​ వల్లే భారత్ తమను కట్టడి చేసిందని ఆసీస్ ఆటగాడ లబుషేన్ అన్నాడు. పేలవ ప్రదర్శన చేస్తున్న స్మిత్​కు అండగా నిలిచాడు. టీమ్​ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జనవరి 7 నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది.

Labuschagne comments on India bowling
'కొద్ది సేపు భారత బౌలర్ల ఉచ్చులో చిక్కుకుపోయాం'

By

Published : Jan 1, 2021, 12:57 PM IST

బాక్సింగ్ డే టెస్టులో టీమ్​ఇండియా అద్భుతమైన బౌలింగ్​ చేసి, తమను తక్కువ పరుగులకే కట్టడి చేసిందని ఆస్ట్రేలియా యువ ఆటగాడు మార్నస్ లబుషేన్ చెప్పాడు. ఇదే సిరీస్​లో పేలవ ప్రదర్శన చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్న​ స్మిత్​ను వెనకేసుకొచ్చాడు.

"ఈ సిరీస్​కు ముందు వరకు నేను అశ్విన్ బౌలింగ్​ ఆడలేదు. మంచి బౌలర్​, ఆలోచనాపరుడు అనడానికి అతడి గణాంకాలే నిదర్శనం. తాను అనుకున్న విధంగా అశ్విన్ బౌలింగ్​ చేయగలిగాడు. కొద్దిసేపు మేం భారత బౌలర్ల వలలో చిక్కుకుపోయాం. స్పిన్​తో పాటు పేస్​ బౌలింగ్​ కూడా భారత్​ బాగా వేసింది"

-మార్నస్ లబుషేన్, ఆసీస్ బ్యాట్స్​మన్

అలానే పరుగులు చేయడంలో విఫలమవుతున్న సహచర బ్యాట్స్​మన్​ స్మిత్​​కు అండగా నిలిచాడు లబుషేన్. సిడ్నీ వేదికగా భారత్​పై 60 బంతుల్లోనే స్మిత్ శతకం చేశాడని అది ఈ మధ్య జరిగిన మ్యాచ్​ అని గుర్తుచేశాడు.

వికెట్​ పడగొట్టిన ఆనందంలో అశ్విన్​​

భారత్​తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో... ఆస్ట్రేలియా మూడు ఇన్నింగ్స్​ల్లో 191, 195, 200 పరుగులకే ఆలౌటైంది. ఈ సిరీస్​లో ప్రస్తుతం అశ్విన్​ పది వికెట్లు తీశాడు. రెండుసార్లు స్మిత్​, లబుషేన్ ఓసారి​ అశ్విన్​ బౌలింగ్​లోనే ఔటయ్యారు.

ఇదీ చదవండి:టీమ్​ఇండియా 'కెప్టెన్సీ'పై చర్చ.. సచిన్ స్పందన

ABOUT THE AUTHOR

...view details