ఐపీఎల్‌లో పాల్గొనే ఇంగ్లాండ్ ఆటగాళ్లతో విభేదాలు కోరుకోవట్లేదని ఈసీబీ డైరెక్టర్ ఆష్లే గైల్స్ అన్నాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం లేదా ఫ్రాంచైజీకి ఆడటంపై తేల్చుకోమంటే అగ్రశ్రేణి ఆటగాళ్లను కోల్పోతామని చెప్పాడు.
"ఆటగాళ్లతో విభేదాలు కోరుకోవడం లేదు. భవిష్యత్తులో సమస్యలు తలెత్తే ప్రమాదముంటుందని అర్థం చేసుకోవాలి. ఐపీఎల్ విషయంలో ఆటగాళ్లతో కఠిన వైఖరి అవలంభించాలని అనుకోవట్లేదు. అలా చేస్తే కొందరు అత్యుత్తమ ఆటగాళ్లను కోల్పోతాం."