తెలంగాణ

telangana

ETV Bharat / sports

'వికెట్లు కోల్పోయినా.. మంచి స్థితిలోనే ఉన్నాం'

కింగ్​స్టన్ వేదికగా వెస్టిండీస్​తో జరుగుతోన్న రెండో టెస్టులో టీమిండియా మంచి స్థితిలోనే ఉందని అన్నాడు ఓపెనర్ మయాంక్ అగర్వాల్. తొలి సెషన్​లో వెనుకంజ వేసినప్పటికీ తర్వాత పుంజుకున్నామని చెప్పాడు.

మయాంక్

By

Published : Aug 31, 2019, 2:38 PM IST

Updated : Sep 28, 2019, 11:22 PM IST

వెస్టిండీస్​తో జరుగుతోన్న రెండో టెస్టులో అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్. తొలి రోజే 5 వికెట్లు కోల్పోయినప్పటికీ మంచి స్థితిలో నిలిచామని అభిప్రాయపడ్డాడు.

"తొలి సెషన్​లో పరిస్థితులు ఛాలెంజింగ్​గా అనిపించాయి. బంతి స్వింగ్ అయింది. కీమర్ రోచ్, హోల్డర్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. మొదటి రోజు 5 వికెట్లు కోల్పోయినప్పటికీ మంచి స్థితిలోనే ఉన్నాం"
-మయాంక్ అగర్వాల్, టీమిండియా ఓపెనర్.

విండీస్ బౌలర్లు లైన్​ అండ్​ లెంగ్త్​లో బౌలింగ్ చేశారని, రకీమ్ కార్న్​వెల్​ నిలకడగా ఆడాడని తెలిపాడు మయాంక్.

"విండీస్ కెప్టెన్ హోల్డర్ సరైన లైన్ అండ్​ లెంగ్త్​తో బౌలింగ్ చేసి బ్యాట్స్​మెన్​ పరుగులు చేసేందుకు అవకాశమివ్వలేదు. అతడు తొలి ఏడు ఓవర్లలో నాలుగు మెయిడిన్లు చేశాడంటే బౌలింగ్ ఎంత కఠినంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పుజారా వికెట్ తీసిన రకీమ్ నిలకడగా బంతులేశాడు" -మయాంక్ అగర్వాల్, టీమిండియా ఓపెనర్.

కింగ్​స్టన్​ వేదికగా విండీస్​తో జరుగుతోన్న చివరిదైన రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(76), మయాంక్ అగర్వాల్(55) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. కరీబియన్ సారథి హోల్డర్ 3 వికెట్లతో రాణించాడు.

ఇవీ చూడండి.. భారీకాయుడు.. అరంగేట్రంలోనే భళా

Last Updated : Sep 28, 2019, 11:22 PM IST

ABOUT THE AUTHOR

...view details