కరోనా వ్యాప్తి కారణంగా ఐపీఎల్, దేశవాళీ మ్యాచ్‌లు ఆగిపోతే ఆటగాళ్లకు తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని ఆసీస్ వన్డే కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. ఆ సమస్యలను అందరం కలిసికట్టుగా ఎదుర్కొంటామని తెలిపాడు.
"రెవెన్యూ షేర్ మోడల్లో ఈ విధమైన నష్టాలు వస్తాయి. ఆర్గనైజేషన్‌పై ప్రభావం పడితే అది ఆటగాళ్లపైనా ఉంటుంది. ఇటువంటి స్థితిని మేము ఎప్పుడూ ఎదుర్కోలేదు. కొన్ని గంటల్లోనే మా ప్రయాణాలు రద్దయ్యాయి. ఈ పరిస్థితి మరెంతో కాలం సాగదని అనుకుంటున్నా. త్వరలోనే సాధారణ వాతావరణం నెలకొంటుంది. కానీ, అది ఎంత కాలం పడుతుందో చెప్పలేము. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకుంటూ.. వ్యాప్తిని ఆపడానికి మీరు చేయగలిగినవి చేయండి."