తెలంగాణ

telangana

షమి అద్భుత బౌలింగ్​ వెనుక రహస్యం ఇదే..!

By

Published : Oct 7, 2019, 1:11 PM IST

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్​ ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్​లో ఐదు వికెట్లతో సత్తా చాటాడు బౌలర్ మహ్మద్​ షమి. ఈ అద్భుతమైన ప్రదర్శన వెనుక ఓ రహస్యం ఉందని చెప్పాడు​ రోహిత్​శర్మ.

షమి బౌలింగ్​ వెనుక రహస్యం ఇదేనా..!

విశాఖపట్నం వేదికగా జరిగిన టీమిండియా-దక్షిణాఫ్రికా​ తొలిటెస్టులో కోహ్లీసేన భారీ విజయం సొంతం చేసుకుంది. మూడు టెస్టుల సిరీస్​లో 1-0 ఆధిక్యం సంపాదించింది. ఈ మ్యాచ్​ రెండో ఇన్నింగ్స్​లో తనదైన పేస్​ బౌలింగ్​తో చెలరేగిపోయాడు మహ్మద్​ షమి. ఈ పేసర్​ అద్భుతమైన ప్రదర్శన వెనుక ఓ రహస్యం ఉందని చెప్పాడు ఓపెనర్​ రోహిత్​శర్మ.

మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​ అవార్డుతో రోహిత్​

" ఈ మధ్య కాలంలో షమి బాగా ఆడుతున్నాడు. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్‌లోనూ సత్తాచాటాడు. చాలా నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తున్నాడు. ఇలా అదరగొట్టడం వెనుక ఓ రహస్యం ఉంది. బిర్యానీ తిన్న తర్వాత ఎంతో ఉత్సాహంగా ఉంటాడు. అప్పుడే అతడిలోని అత్యుత్తమ ప్రతిభ బయటకి వస్తుంది" -- ఓపెనర్​ రోహిత్​శర్మ, భారత ఓపెనర్​

రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు బాదిన రోహిత్‌ శర్మకు 'ప్లేయర్ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది. మ్యాచ్​ అనంతరం మాట్లాడిన రోహిత్​... ఏదో ఓ రోజు ఓపెనింగ్‌ చేయాల్సి వస్తుందని, యాజమాన్యంరెండేళ్ల క్రితమే చెప్పిందన్నాడు. అందుకే నెట్స్‌లోనూ కొత్త బంతితోనే సాధన చేసినట్లు చెప్పాడు​.

ఇదీ చదవండి....

ABOUT THE AUTHOR

...view details