గాయంతో జట్టుకు దూరంగా ఉండటం.. నిలకడలేమితో ప్రదర్శన చేయలేకపోవడం లాంటి కారణాలతో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంపై అనుమానం రేకెత్తింది. ఇదే సమయంలో కేఎల్ రాహుల్ సత్తాచాటుతుండటం వల్ల ధావన్ పని అయిపోయినట్లే అనుకుంటున్నారు క్రీడా ప్రేక్షకులు. అయితే ఈ అంశంపై స్పందించిన గబ్బర్.. తమ మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉందని, క్రికెట్లో ఇది చాలా అవసరమని అన్నాడు.
రాహుల్‌తో ఆరోగ్యకరమైన పోటీ: ధావన్ - Kl Rahul Dhawan
పుణె వేదికగా శ్రీలంకతో మూడో టీ20 విజయానంతరం టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మాట్లాడాడు. కేఎల్ రాహుల్‌తో తనకు ఆరోగ్యకరమైన పోటీ ఉందని తెలిపాడు.

"రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఇద్దరం జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చాం. గత మ్యాచ్‌లోనూ 30 పరుగులతో రాణించా. నా దృష్టిలో అవి కూడా విలువైనవే. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే.. ఎక్కువ పరుగులు చేయొచ్చు. ఈ మ్యాచ్‌లో వెంట వెంటనే వికెట్లు కోల్పోయినప్పటికీ 200 పైచిలుకు పరుగులు సాధించాం. మా ఇద్దరి(రాహుల్‌తో) మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది. మేము మంచి స్నేహితులం." -శిఖర్ ధావన్, టీమిండియా ఓపెనర్
పుణె వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా ఇచ్చిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 123 రన్స్‌కే చేతులెత్తేశారు లంకేయులు. ఫలితంగా 78 పరుగుల తేడాతో గెలుపొందింది కోహ్లీ సేన. ఈ మ్యాచ్‌లో ధావన్ 36 బంతుల్లో 52 పరుగులు చేసి పాత గబ్బర్ను గుర్తు చేశాడు. రాహుల్ 54 పరుగులతో మరోసారి అదరగొట్టాడు.
ఇదీ చదవండి: వడాపావ్, పూరీపై భారత క్రికెటర్ల ముచ్చట్లు