బే ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్.. 615/9 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కివీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ బీజే వాట్లింగ్(205) ద్విశతకంతో అదరగొట్టగా.. బౌలర్ మిచెల్ సాంట్నర్ శతకంతో(126) రాణించాడు. గ్రాండ్ హోమ్(65) అర్ధశతకం చేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు బర్న్స్, డోమనిక్ క్రీజులో ఉన్నారు.
వాట్లింగ్ డబుల్ సెంచరీ..
కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ వాట్లింగ్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లీష్ బౌలర్ల సహనానికి పరీక్ష పెడతూ చూడచక్కని షాట్లతో అలరించాడు. 473 బంతుల్లో 205 పరుగులు చేసి కివీస్‌కు భారీ స్కోరు అందించాడు.