తెలంగాణ

telangana

By

Published : Jan 31, 2020, 5:54 PM IST

Updated : Feb 28, 2020, 4:37 PM IST

ETV Bharat / sports

నాలుగో టీ20లో కోహ్లీ మెరుపు ఫీల్డింగ్‌ హైలైట్​

భారత్​-న్యూజిలాండ్​ మధ్య జరిగిన నాలుగో టీ20లో భారత్​ అద్భుత విజయం సాధించింది. ఐదు మ్యాచ్​ల సిరీస్​లో రెండోసారి సూపర్​ ఓవర్​లో తలపడి గెలిచింది. అయితే ఈ మ్యాచ్​లో టీమిండియా ఇచ్చిన 166 పరుగుల లక్ష్య ఛేదనలో ఓ సమయంలో గెలిచేలా కనిపించింది కివీస్.​ మున్రో అద్భుతంగా రాణించాడు. అయితే కీలక సమయంలో కోహ్లీ మెరుపు ఫీల్డింగ్​కు ఇతడు ఔట్​ కావడమే మ్యాచ్​ను మలుపుతిప్పింది.

Colin Munro runout by virat
కివీస్​ ఓటమిలో కోహ్లీ మెరుపు ఫీల్డింగ్‌ హైలైట్​

టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ.. మైదానంలో బ్యాట్​తోనే కాకుండా ఫీల్డింగ్​లోనూ అదరగొట్టేస్తాడు. ఈరోజు జరిగిన మ్యాచ్​లో మరోసారి కోహ్లీ ఫీల్డింగ్ హైలెట్​గా నిలిచింది. న్యూజిలాండ్​తో జరిగిన నాలుగో టీ20లో చేసిన ఓ మెరుపు రనౌట్​ మ్యాచ్​ స్వరూపాన్నే మార్చేసింది. 166 పరుగుల లక్ష్య ఛేదనను ధాటిగానే ఆరంభించింది న్యూజిలాండ్​ జట్టు. గప్తిల్​(4) ఆదిలోనే ఔటైనా.. మరో ఓపెనర్​ మున్రో(64), సీఫెర్ట్​(57) రాణించారు. అయితే ఒకానొక సమయంలో 11.4 ఓవర్లకు 96 పరుగులతో దూసుకెళ్తున్న న్యూజిలాండ్​కు తనదైన ఫీల్డింగ్​తో షాకిచ్చాడు కోహ్లీ.

శివమ్​ దూబే వేసిన బంతిని కవర్స్‌ మీదుగా షాట్‌ కొట్టాడు మున్రో. అయితే బౌండరీ లైన్‌ సమీపంలో ఫీల్డింగ్‌ చేస్తున్న శార్దూల్‌ ఠాకూర్‌ బంతిని అందుకున్న మరుక్షణమే షార్ట్‌ కవర్స్‌లో ఉన్న కోహ్లీకి అందించాడు. బంతిని అందుకున్న విరాట్​ అంతే వేగంతో స్ట్రైకింగ్‌ ఎండ్‌లోకి విసిరి వికెట్లను పడగొట్టాడు. అప్పటికి ఒక పరుగు తీసి మరో పరుగు కోసం​ ప్రయత్నిస్తున్న మున్రో రనౌట్‌ అయ్యాడు. ఫలితంగా మున్రో 47 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64 పరుగులు సాధించి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.

ఓపెనర్​ మున్రో పెవిలియన్​ చేరాక టిమ్​ సీఫెర్ట్​, టేలర్ జాగ్రత్తగా ఆడుతూ పరుగులు సాధించారు. సీఫెర్ట్ అర్ధశతకంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. కివీస్ గెలుపునకు చివరి ఓవర్లో 7 పరుగులు కావాల్సి ఉండగా శార్దూల్​ అద్భుత బౌలింగ్​కు 6 రన్స్​ చేసి మ్యాచ్​ను టై చేసుకుంది న్యూజిలాండ్​.

Last Updated : Feb 28, 2020, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details