క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించిన టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ.. తన గారాల పట్టి జీవాతో సరదాగా గడుపుతున్నాడు. ముస్సోరీలోని మంచు కొండల్లో విహరిస్తున్నాడు. తాజాగా ఇద్దరూ కలిసి మంచులో ఆడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ధోనీ, జీవా మధ్య 'స్నో బాల్' ఫైట్ పాటకు ఫిదా...
ఈ పర్యనటలోనే జనవరి 5న... జీవా గిటార్ వాయిస్తూ ఈక్వెస్ట్రియా ల్యాండ్ ఆఫ్ లవ్ సాంగ్ పాడిన వీడియోను ధోనీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
''బయట కురుస్తున్న మంచు ఆమెలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తెస్తోంది'' అని వీడియోకి క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోకు విపరీతమైన స్పందన లభించింది. అంతేకాకుండా ధోనీ, జీవా కలిసి 'స్నోమ్యాన్' తయారుచేస్తున్న వీడియో కూడా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
>> ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్ అనంతరం ధోనీ క్రికెట్‌కు విరామం ప్రకటించాడు. భారత ఆర్మీకి సేవలందించాలని వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ సిరీస్‌లకు అందుబాటులో లేడు. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ధోనీ తిరిగి జట్టులోకి వస్తాడని అందరూ భావిస్తున్నారు. కానీ మెగాటోర్నీలో భారత్ తరఫున అతడు ప్రాతినిథ్యం వహించాలంటే... ఐపీఎల్‌లో సత్తా చాటాల్సి ఉంటుందని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.
>> 38 ఏళ్ల మిస్టర్ కూల్... ఇప్పటివరకు 350 వన్డేలు, 90 టెస్టులు, 98 టీ20లు ఆడాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ కెరీర్లో 829 మందిని ఔట్ చేశాడు. ఇతడి సారథ్యంలోనే టీమిండియా టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ అందుకుంది.