తన 24 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో రికార్డులు సృష్టించిన క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్.. సోమవారం మరో మైలురాయి చేరుకున్నాడు. అయితే ఈసారి క్రికెట్ మైదానంలో కాదు.. తన వ్యక్తిగత జీవితంలో కావటం విశేషం. తన కలలరాణి అంజలీతో సచిన్ వివాహమై నిన్నటికి 25 ఏళ్లు. దీంతో వివాహ వార్షికోత్సవాన్ని ఇంట్లోనే ప్రత్యేకంగా జరుపుకున్నాడు. ఈ సందర్భంగా సచిన్ మామిడి పండుతో కుల్ఫీని స్వయంగా తయారు చేసి తన కుటుంబసభ్యులకు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
కుటుంబ సభ్యుల్ని సర్‌ప్రైజ్ చేసిన సచిన్ - సచిన్ తెందుల్కర్ తాజా వార్తలు
సోమవారం తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబసభ్యుల్ని సర్‌ప్రైజ్ చేశాడు దిగ్గజ సచిన్. నోరూరించే మ్యాంగ్ కుల్ఫీని స్వయంగా తయారు చేసి, వారిని ఆశ్చర్యపరిచాడు.
![కుటుంబ సభ్యుల్ని సర్‌ప్రైజ్ చేసిన సచిన్ కుటుంబ సభ్యుల్ని సర్‌ప్రైజ్ చేసిన సచిన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7351824-982-7351824-1590480579978.jpg)
సచిన్ తెందుల్కర్
"మా వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఓ సర్‌ప్రైజ్. మ్యాంగో కుల్ఫీని తయారుచేసి మా ఇంట్లో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచా" అని తెందుల్కర్ తన ఇన్‌స్టా ఖాతాలో పేర్కొన్నాడు. అంతే కాకుండా ఎలా తయారుచేశానో వివరిస్తూ ఓ వీడియో కూడా దానికి జతచేశారు. దీన్ని తయారు చేయటానికి ఆయనకు నాలుగు గంటలు పట్టిందట. సుమారు రెండున్నర నిముషాల పాటు సాగే ఈ వీడియోలో ఆయన మాతృమూర్తిని చూడొచ్చు. ఇక ఈ వీడియోను సుమారు ఐదు లక్షల మంది లైక్ చేశారు.