దీపావళి పండుగను పురస్కరించుకుని ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్లో ఓ వీడియోను షేర్ చేసింది. ఇదికాస్తా వైరల్గా మారింది. అందుకు కారణం ఏంటంటే ఈ వీడియోలో ధోనీ.. విండీస్ ఆటగాడు బ్రావోతో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడుతూ కనిపించడం
క్రికెటర్గా మారడానికి ముందు ధోనీ తన కెరీర్‌ను ఫుట్‌బాల్ గోల్కీపర్తో ప్రారంభించాడు. గోల్ఫ్లోనూ మంచి ప్రావీణ్యం ఉంది. ఇదే వీడియోలో మరో క్రికెటర్ రవీంద్ర జడేజా బిలియర్డ్స్ ఆడుతూ కనిపించాడు.