తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెటర్​ ధోనీ సింగర్​గా మారిన వేళ - dhoni latest news

టీమిండియా వికెట్​కీపర్​ మహేంద్ర సింగ్ ధోనీ.. ఓ కార్యక్రమంలో భాగంగా గాయకుడిగా మారాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా​ మారింది.

Watch: MS Dhoni Sings Old Hindi Movie Song In Viral Video
క్రికెటర్​ ధోని సింగర్​గా మారిన వేళ

By

Published : Dec 5, 2019, 6:31 AM IST

అదిరిపోయే బ్యాటింగ్​తో, అద్భుతమైన వికెట్​కీపింగ్​ స్కిల్స్​తో అభిమానులను ఆకట్టుకున్న మహేంద్ర సింగ్ ధోనీ.. గత కొంత కాలంగా ఆట​కు దూరంగా ఉంటున్నాడు. అభిమానులు అతడి మనసులో ఏముందో తెలుసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మరికొంత మంది ధోనీ ఏం చేస్తున్నాడా అనే విషయంపై ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రస్తుతం కుటుంబ సభ్యులు, స్నేహితులతో తన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు ధోనీ. ఇటీవలే జరిగిన కార్యక్రమలో అతడి స్నేహితుడితో కలిసి హిందీలో ఓ పాత పాటను పాడి అలరించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్‌ తర్వాత మహీ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి నిరవధిక విరామం తీసుకున్నాడు. రెండు నెలలు సైన్యంలో పనిచేశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చేసినా జట్టుకు మాత్రం అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయంపై ప్రశ్నించగా ‘జనవరి వరకు నన్నేమీ అడగొద్దు’ అని చెప్పాడు. మరోవైపు ధోనీ గురించి ఆలోచించకుండా యువ వికెట్​కీపర్లకు అవకాశం ఇవ్వాలని సెలక్షన్​ కమిటీ భావిస్తోంది.

ఇదీ చదవండి: తొలి టీ20 హైదరాబాద్​లో.. చివరిది ముంబయిలో

ABOUT THE AUTHOR

...view details