తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఉనద్కత్ చేసిన రనౌట్​కు బ్యాట్స్​మన్ షాక్ - Akash Deep Run Out

సౌరాష్ట్ర-బంగాల్ మధ్య జరుగుతున్న రంజీ ఫైనల్​లో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. బంగాల్ బ్యాట్స్​మన్ ఆకాశ్​దీప్ రనౌట్​ అయిన తీరు అభిమానులను నిరాశపరిచింది.

ఉనద్కత్
ఉనద్కత్

By

Published : Mar 13, 2020, 12:39 PM IST

రంజీ ట్రోఫీ గెలుచుకునేందుకు, ప్రస్తుతం జరుగుతున్న ఫైనల్​లో సౌరాష్ట్ర-బంగాల్ జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే విజయం కోసం కష్టంతో పాటు కొంత అదృష్టం ఉండాల్సిందే. అందుకోసం దారులు వెతకాల్సిందే. ప్రత్యర్థి తప్పులను పసిగట్టి వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవాల్సిందే. అలాంటి సంఘటనే ఈ మ్యాచ్​లో జరిగింది. బంగాల్ ఆటగాడు ఆకాశ్ దీప్ రనౌట్​ సౌరాష్ట్రకు కలిసొచ్చింది.

అసలేం జరిగింది?

సౌరాష్ట్ర సారథి జయదేవ్ ఉనద్కత్ వేసిన బంతి, బ్యాట్స్​మెన్ ఆకాశ్ దీప్​ను మిస్ అయ్యి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అయితే క్రీజు లైన్​పై ఉన్న దీప్​ను కీపర్ రనౌట్​ చేయడానికి ప్రయత్నించగా బాల్ వికెట్లను తాకకుండా నేరుగా బౌలర్ ఉనద్కత్ చేతుల్లోకి వెళ్లింది. తన తెలివిని ఉపయోగించిన ఉనద్కత్.. రెప్పపాటులో వికెట్లపైకి త్రో విసిరాడు. ఫలితంగా సరిగ్గా క్రీజు​పై ఉన్న ఆకాశ్​ రనౌట్​గా వెనుదిరిగాడు.

ఈ మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​లో సౌరాష్ట్ర 425 పరుగులు చేసింది. అనంతరం 381 పరుగులే చేసి ఆలౌటైంది బంగాల్. ఫలితంగా మ్యాచ్​ విజయాన్ని ఖరారు చేసే ఫస్ట్ ఇన్నింగ్స్​లో 44 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది సౌరాష్ట్ర. ఇంకా రెండో ఇన్నింగ్స్​లు ఉండగా.. సౌరాష్ట్ర విజయం దాదాపు ఖరారైనట్టే.

ABOUT THE AUTHOR

...view details