కరోనా వైరస్ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు ఇంటికే పరిమితమైపోయారు. కేఎల్ రాహుల్ కూడా ఇంటి వద్దే సరదాగా గడుపుతున్నాడు. తాజాగా ఈ ఆటగాడు సామాజిక మాధ్యమాల్లో తన రోజు ఎలా గడుస్తుందో ఓ వీడియో ద్వారా వివరించాడు.
ఈ వీడియోలో మొదట కాసేపు బ్యాట్, బంతితో గడిపిన రాహుల్ తర్వాత గేమ్ ఆడుతూ, అనంతరం పుస్తకం చదువుతూ, కాసేపు మొబైల్ చూస్తూ కనిపించాడు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఈ ఆటగాడు దానికి 'స్టే హోమ్ ఛాలెంజ్'అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.