తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధోని, రోహిత్ వల్లే కోహ్లీకి విజయాలు' - dhoni

కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గంభీర్. కెప్టెన్సీలో విరాట్ విజయాలకు కారణం ధోని, రోహిత్ అని అభిప్రాయపడ్డాడు.

గంభీర్

By

Published : Jul 10, 2019, 9:00 AM IST

ధోని టీమిండియా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాక కోహ్లి కెప్టెన్సీ చేపట్టాడు. అతడి సారథ్యంలో భారత్ కొంత కాలంగా విజయాలతో దూసుకుపోతుంది. టెస్టుల్లో అగ్రస్థానంలో ఉంది. కానీ కోహ్లి సారథిగా విజయాలు సాధించడానికి ధోని, రోహిత్​లే కారణం అంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ గంభీర్.

ప్రస్తుత ప్రపంచకప్​లో లీగ్ దశను అగ్రస్థానంతో ముగించింది భారత్. ఆడిన తొమ్మిది మ్యాచ్​లో కేవలం ఒకటి మాత్రమే ఓడిపోయింది. అయినా గంభీర్.. కోహ్లీ కెప్టెన్సీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇంతకుముందు ఐపీఎల్ సమయంలోనూ విరాట్ కెప్టెన్సీపై విమర్శలు కురిపించాడు గంభీర్.

"ధోని, రోహిత్ వలనే టీమిండియాకు విరాట్ మంచి సారథిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్​లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు టైటిల్ అందించడంలో విఫలమయ్యాడు. చాలాసార్లు ఆ జట్టు 8వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భారత్ జట్టులో ధోని, రోహిత్ ఉన్నారు.. కానీ బెంగళూరులో ధోని, రోహిత్ లేరు అందుకే విరాట్ ఐపీఎల్​లో సక్సెస్ కాలేకపోతున్నాడు".
-గంభీర్, టీమిండియా మాజీ ఆటగాడు

ప్రస్తుతం జరుగుతోన్న ప్రపంచకప్​లో టీమిండియా సెమీస్​లో న్యూజిలాండ్​తో తలపడుతుంది. లీగ్ దశను అగ్రస్థానంతో ముగించిన కోహ్లీసేన టైటిల్​పై కన్నేసింది.

ఇవీ చూడండి.. WC19: వర్షం రావడమే మంచిదైంది

ABOUT THE AUTHOR

...view details