ఇంగ్లాండ్‌తో మొతేరా స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో.. ఓ అభిమాని బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘించాడు. భారత సారథి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. అతడిని కలిసేందుకు మైదానంలోకి పరుగులు పెట్టాడు. ఇది గమనించిన కోహ్లీ.. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే పక్కకు జరిగి.. అభిమానిని దూరం నుంచే పంపించేశాడు.
భద్రతా నిబంధనలను అతిక్రమించి అభిమాని మైదానంలోకి దూసుకొచ్చిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.