అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతోన్న సెమీ ఫైనల్లో టీమిండియా అదరగొడుతోంది. ఈ మ్యాచ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్‌ను బౌలింగ్, ఫీల్డింగ్‌తో వణికించారు భారత ఆటగాళ్లు. ఇందులో దివ్యాంశ్ సక్సేనా పట్టిన ఓ క్యాచ్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.
ఓవైపు వరుసగా వికెట్లు కోల్పోతున్న తరుణంలో పాక్‌కు భారీ భాగస్వామ్యం అవసరమైంది. ఈ దశలో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మహ్మద్ హరీస్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. 15 బంతుల్లో 21 పరుగులు చేసి డేంజర్‌గా మారుతున్న సమయంలో ఇతడిని అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్ పంపాడు దివ్యాంశ్ సక్సేనా. హరీస్ డీప్ స్వ్యేర్ లెగ్‌లో షాట్ కొట్టగా.. చాలా దూరం నుంచి పరుగెత్తుకొచ్చిన సక్సేనా.. బంతి నేలకు తాకే సమయంలో ఒడిసిపట్టి ఔరా అనిపించాడు.