బాల్ టాంపరింగ్ వివాదంపై ఇంగ్లాండ్ అభిమానులు.. ఆస్ట్రేలియా క్రికెటర్లనుఇప్పటికీ ఎగతాళి చేస్తూనే ఉన్నారు. ప్రపంచకప్, ప్రస్తుతం జరుగుతున్న యాషెస్‌లోనూ వార్నర్, స్మిత్‌లకు చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి.
యాషెస్ మొదటి టెస్టులో సాండ్ పేపర్‌ను చూపిస్తూ ఇంగ్లీష్ అభిమానులు, వార్నర్‌ను వెక్కిరించగా.. తన ప్యాంట్ జేబుల్లో ఏమి లేదని చూపిస్తూ సరైన సమాధానమే ఇచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్టులోనూ మరోసారివారికి గట్టిగా బదులిచ్చాడు వార్నర్.
ఎడ్జ్‌బాస్టన్ మైదానం డ్రెస్సింగ్ రూమ్‌లోంచి ఆసీస్ ఆటగాళ్లు బయటకు వచ్చే సమయంలో వార్నర్‌ను చూసి.. మోసగాడివంటూ అరవడం మొదలు పెట్టారు ఇంగ్లాండ్ అభిమానులు. వారివైపు చూస్తూ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ స్టార్ రిక్ ఫ్లెయర్ మాదిరిగా సంజ్ఞ చేశాడీ క్రికెటర్. ఈ వీడియో వైరల్‌గా మారింది. వార్నర్ సమయస్ఫూర్తికి నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు.
ఈ యాషెస్‌లో బ్యాట్స్‌మెన్‌గా పూర్తిగా విఫలమవుతున్నాడువార్నర్. ఇప్పటివరకూ ఒక్క భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. వరుసగా 2, 8, 3, 5, 61, 0, 0 పరుగులు చేసి నిరాశపర్చాడు. చివరి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
ఇవీ చూడండి.. 'విజ్ఞాన శాస్త్రంలో ఓటమి లేదు.. విజయం తప్ప'