తెలంగాణ

telangana

ETV Bharat / sports

బిగ్​బాష్​ లీగ్​లో అరంగేట్రం స్టెయిన్​కు ఓ పీడకలే..! - అడిలైడ్ స్ట్రైకర్స్

బిగ్​బాష్​ లీగ్​లో దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ డెయిల్ స్టెయిన్​ అరంగేట్రం చేశాడు. కానీ మొదటి ఓవర్లోనే 20 పరుగులిచ్చి నిరాశపర్చాడు.

Dale Steyns
స్టెయిన్

By

Published : Dec 28, 2019, 11:07 AM IST

స్టార్ బౌలర్​.. బ్యాట్స్​మన్​ వెన్నులో వణుకుపుట్టించే వేగం.. పదునైన బౌన్సర్స్​ సంధించడంలో దిట్ట. అతనెవరో కాదు దక్షిణాఫ్రికా పేసర్ డెయిల్ స్టెయిన్. అలాంటి బౌలర్ ఆస్ట్రేలియాలో జరుగుతోన్న బిగ్​బాష్​లో అరంగేట్రం ఎలా ఉండాలని కోరుకుంటాడు. కానీ ఇతడికి అలా జరగలేదు.

బిగ్​బాష్​ లీగ్​లో మెల్​బోర్న్ స్టార్స్​కు ప్రాతినిధ్యం వహిస్తోన్న స్టెయిన్ అడిలైడ్ స్ట్రైకర్స్​తో మొదటి మ్యాచ్ ఆడాడు. మొదటి బంతిని డాట్​ బాల్​గా వేసిన స్టెయిన్​కు తర్వాత మాత్రం చుక్కెదురైంది. తర్వాత బంతులకు వరుసగా రెండు సిక్సులు, రెండు ఫోర్లు బాదాడు జేక్ వెదరాల్డ్. చివరి బంతికి జేక్​ను ఔట్ చేసి ఉపశమనం పొందాడు స్టెయిన్. కానీ వేసిన మొదటి ఓవర్లోనే 20 పరుగులిచ్చి నిరాశపర్చాడు. ఈ ఐపీఎల్​ వేలంలో ఇతడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 కోట్లకు సొంతం చేసుకుంది.

ఇవీ చూడండి.. పాక్ క్రికెటర్​ అక్రమ్​ లీక్​ వీడియో.. అక్తర్ పోస్ట్

ABOUT THE AUTHOR

...view details