లాక్‌డౌన్‌తో రాంచీలోని తన ఫామ్‌హౌస్‌కే పరిమితమైన టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ.. కూతురు జీవాతో ఖాళీ సమయాన్ని గడుపుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఈ వీడియోను చెన్నై సూపర్‌కింగ్స్ తన ట్విట్టర్లో పంచుకుంది. ఇందులో పెంపుడు కుక్కను ఆటపట్టిస్తూ కనిపించారు ధోనీ-జీవా.
ధోనీ- జీవాల క్యూట్ వీడియో - జీవా ధోనీ తాజా వీడియో
ధోనీ-జీవాలకు సంబంధించిన క్యూట్ వీడియోను ట్వీట్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఇందులో వీరిద్దరూ కుక్కతో ఆడుతూ కనిపించారు.
కూతురు జీవాతో ధోనీ
గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించిన ధోనీ.. ఐపీఎల్లో 13వ సీజన్లో రాణించి, జట్టులో చోటు దక్కించుకోవాలని భావించాడు. అయితే ప్రాణాంతక కరోనా కారణంగా లీగ్ నిరవధిక వాయిదా పడింది. ఈ ఏడాది జరిగేది కష్టంగానే కనిపిస్తోంది.