భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగక దాదాపు 8 ఏళ్లు కావొస్తుంది. ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా.. ఆ ప్రభావం క్రికెట్‌పైనా పడింది. కానీ, ఈ రాజకీయాలు అన్నీ పక్కనపెట్టి ఇరుదేశాలు త్వరలోనే ఓ సిరీస్‌లో పాల్గొబోతున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాదే రెండు దేశాల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుందని సమాచారం. తాజాగా దీనిపై స్పందించాడు పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ. క్రికెట్ వల్ల ఇరుదేశాల మధ్య స్నేహబంధం పెరుగుతుందని పేర్కొన్నాడు.
"భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ సిరీస్‌లు చాలా ముఖ్యం. క్రీడల్ని రాజకీయలకు దూరంగా ఉంచాలి. క్రికెట్ వల్ల ఇరుదేశాల మధ్య సంబంధాలు బలపడతాయి. పాక్‌కు రావడాన్ని భారత క్రికెటర్లు ఎంజాయ్ చేస్తారని నా నమ్మకం."