బాలీవుడ్ పాటలకు విదేశీ క్రికెటర్లు చిందేయటం కొత్తేం కాదు. ఐపీఎల్‌లోనే చాలాసార్లు ఆటగాళ్లంతా ఓచోట చేరి ఆడిపాడిన సంఘటలు జరిగాయి. ఇప్పుడు మాత్రం బార్బడోస్‌లో జరిగిన ఓ వేడుకలో హిందీ పాటలకు స్టెప్పులేశాడు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గ్యారీ సోబర్స్. ఈ వీడియోను ఓ వ్యక్తి తన ట్విట్టర్లో పంచుకున్నాడు.
బాలీవుడ్ పాటకు దిగ్గజ క్రికెటర్ స్టెప్పులు - గ్యారీ సోబర్స్ న్యూస్
వెస్టిండీస్ దిగ్గజ క్రికెట్రర్ సర్ గ్యారీ సోబర్స్.. ఓ వివాహ వేడుకలో హిందీ పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

బాలీవుడ్ పాటకు దిగ్గజ క్రికెటర్ స్టెప్పులు
బార్బడోస్‌లో భారతీయ ఓ వివాహ వేడుకకు హాజరైన సోబర్స్.. అనంతరం జరిగిన సంగీత్‌లో డాన్స్ చేసి అలరించాడు. 'జియా హో జియా కుచ్ బోల్ దో' అనే హిందీ పాటకు చిందేశాడు. అతడితో పాటు మరికొందరు వ్యక్తుల కలిసి నృత్యం చేస్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది.
ఇదీ చూడండి.. పరమ శివుడి సేవలో బాలీవుడ్ క్వీన్ కంగనా
Last Updated : Mar 2, 2020, 8:58 AM IST