తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ సారథిగా జాఫర్ ఆల్​టైమ్ ఎలెవన్ - ధోనీ సారథిగా జాఫర్ వన్డే జట్టు

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తన ఆల్​టైమ్ వన్డే ఎలెవన్​ను ప్రకటించాడు. ధోనీకి కెప్టెన్ బాధ్యతలు అప్పగించాడు. సచిన్ తెందూల్కర్, రోహిత్ శర్మలను ఓపెనర్లుగా తీసుకున్నాడు.

ధోనీ
ధోనీ

By

Published : Apr 4, 2020, 3:02 PM IST

కరోనా వైరస్ కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు క్రికెటర్లు. ఇలాంటి సమయంలో టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తన ఆల్​టైమ్ ఎలెవన్ అంటూ ఓ జట్టును ప్రకటించాడు. అత్యుత్తమ ఆటగాళ్లతో ఓ వన్డే జట్టును తయారు చేశాడు.

ఈ జట్టులో ఓపెనర్లుగా సచిన్ తెందూల్కర్, రోహిత్ శర్మలకు చోటు కల్పించాడు. అలాగే మూడులో వెస్టిండీస్ దిగ్గజం వివి రిచర్డ్స్​, నాలుగులో టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీలను ఎంపిక చేశాడు. మిడిలార్డర్​లో దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్, ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ బెన్ స్టోక్స్​లను తీసుకున్నాడు. ఇక కెప్టెన్​గా, కీపర్​గా ధోనీకి బాధ్యతలు అప్పగించాడు.

బౌలర్లలో పాకిస్థాన్ స్వింగ్ మాంత్రికుడు వసీం అక్రమ్, విండీస్ మాజీ పేసర్ జోల్ గార్నర్, ఆసీస్ మాజీ బౌలర్ మెక్​గ్రాత్​లకు చోటు కల్పించాడు. స్పిన్నర్ కోటాలో సక్లయిన్ ముస్తాక్, షేన్ వార్న్​లకు అవకాశం ఇచ్చాడు.

అయితే ఆసీస్​కు ఎన్నో మరపురాని విజయాలనందించిన రికీ పాంటింగ్​ను 12వ ఆటగాడిగా ఎంపిక చేయడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details