తెలంగాణ

telangana

ETV Bharat / sports

జాఫర్ టీ20 జట్టులో భారత్ నుంచి ఒక్కరే! - కోహ్లీ కాదు బుమ్రా.. జాఫర్ టీ20 ఎలెవన్

టీ20ల్లో తన అత్యుత్తమ జట్టును ప్రకటించాడు టీమ్​ఇండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్. ఇందులో భారత్ నుంచి ఒకే ఒక్కరికి చోటు దక్కడం గమనార్హం. ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్​ను కెప్టెన్​గా నియమించాడు.

జాఫర్
జాఫర్

By

Published : Apr 21, 2020, 11:39 AM IST

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తన టీ20 అత్యుత్తమ జట్టును ప్రకటించాడు. అందరికీ కాస్త భిన్నంగా దేశం నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం కల్పించాడు. అలాగే భారత్ నుంచి జస్ప్రీత్ బుమ్రాకు చోటిచ్చాడు. ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్, పాకిస్థాన్ బ్యాట్స్​మన్ బాబర్ అజామ్, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమన్స్ టాపార్డర్​లో ఉన్నారు. వార్నర్​ను కెప్టెన్​గా నియమించాడు.

మిడిలార్డర్​లో డివిలియర్స్, జాస్ బట్లర్, వెస్టిండీస్ ఆల్​రౌండర్ అండ్రూ రసెల్, బంగ్లాదేశ్ ఆల్​రౌండర్ షకిబ్ అల్ హసన్​లను ఎంపిక చేశాడు. ఇక బౌలర్లుగా రషీద్ ఖాన్, నేపాల్ క్రికెటర్ సందీప్ లమిచానే, మలింగ, బుమ్రాను తీసుకున్నాడు.

జాఫర్ టీ20 జట్టు

డేవిడ్ వార్నర్ (కెప్టెన్-ఆస్ట్రేలియా), బాబర్ అజామ్ (పాకిస్థాన్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), డివిలియర్స్ (దక్షిణాఫ్రికా), జాస్ బట్లర్ (కీపర్-ఇంగ్లాండ్), ఆండ్రూ రసెల్ (వెస్టిండీస్), షకిబుల్ అల్ హసన్ (బంగ్లాదేశ్), రషీద్ ఖాన్ (అఫ్ఘనిస్థాన్), సందీప్ లమిచానే (నేపాల్), మలింగ (శ్రీలంక), జస్ప్రీత్ బుమ్రా (భారత్)

ABOUT THE AUTHOR

...view details