ఇప్పటి కాలంలో ఆడుతున్న క్రికెటర్లు మూడు ఫార్మాట్లలో(టెస్టు, వన్డే, టీ20) రాణించాల్సిన అవసరం ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇలా చేయటం వల్ల ఈ క్రీడపై ఆదరణ పెరుగుతోందని చెప్పాడు. ఇటీవలే రిటైర్మెంట్ తీసుకున్న ఇతడు.. చాలా విషయాలను పంచుకున్నాడు.
"రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ తర్వాత వాళ్లను మరిపించేలా ప్రదర్శన చేస్తున్నాడు నయావాల్ చెతేశ్వర్ పుజారా. ప్రస్తుతం టీమిండియాలో నా అభిమాన ఆటగాడంటే అతడే. ప్రస్తుత కాలంలో ఇతర ఫార్మాట్లతో పోలిస్తే టీ20లు అత్యంత ఆదరణ పొందుతున్నాయి. అలా అని ప్రేక్షకులలో ఎక్కువ డిమాండ్ ఉన్న టీ20 ఫార్మాట్‌ను తక్కువ చేసి మాట్లాడలేం. దీనితో పాటే ప్రతి కికెటర్ తప్పకుండా అన్ని ఫార్మట్లలో నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరముంది. ఇప్పుడు ఐపీఎల్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ టోర్నీ వల్లే ఎంతో మంది ప్రతిభావంతులు బయటకొస్తున్నారు. ఆ స్థాయిలో దేశవాళీలోని రంజీట్రోఫీకి ఆదరణ దక్కకపోవటం బాధ కలిగించే విషయం"
- వసీం జాఫర్, టీమిండియా మాజీ క్రికెటర్