తెలంగాణ

telangana

ETV Bharat / sports

150 రంజీ మ్యాచ్​లతో వసీం జాఫర్ రికార్డు - 150 ranji matches

150 రంజీ మ్యాచ్​లాడి, ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్​గా వసీం జాఫర్ రికార్డు సృష్టించాడు. సోమవారం.. విదర్భ - ఆంధ్రప్రదేశ్​ మధ్య జరిగిన మ్యాచ్​తో ఈ ఘనత సాధించాడు.

Wasim Jaffer becomes first Indian to play 150 Ranji matches
150 రంజీ మ్యాచ్​లతో వసీం జాఫర్ రికార్డు

By

Published : Dec 9, 2019, 8:06 PM IST

Updated : Dec 9, 2019, 11:56 PM IST

టీమిండియా సీనియర్ క్రికెటర్ వసీం జాఫర్ అరుదైన ఘనత సాధించాడు. సోమవారంఆంధ్రప్రదేశ్​తో జరిగిన రంజీ మ్యాచ్​తో, 150 మ్యాచ్​లాడిన తొలి భారత్ క్రికెటర్​గా రికార్డు సృష్టించాడు. నేటి నుంచే ఈ దేశవాళీ సమరం ప్రారంభమైంది.

విదర్భకు కెప్టెన్​గా ఉన్న జాఫర్.. గత రెండేళ్లుగా ఆ జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు మొత్తంగా 253 ఫస్టక్లాస్ క్రికెట్ మ్యాచ్​లు ఆడాడు.

41 ఏళ్ల ఈ విదర్భ క్రికెటర్.. ఫస్టక్లాస్​లో 20 వేల మైలురాయికి మరో 853 పరుగుల దూరంలో ఉన్నాడు.వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు 318. ఇప్పటివరకు 19,147 పరుగులు చేశాడు. ఇందులో 57 సెంచరీలు, 88 అర్థశతకాలు ఉన్నాయి.

2000 నుంచి 2008 వరకు భారత్​ తరఫున 31 టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. 1944 పరుగులు చేశాడు.ఇందులో 5 శతకాలు, 11 అర్ధసెంచరీలు, ఓ ద్విశతకం ఉన్నాయి. 2006లో విండీస్​పై 212 పరుగులు.. టెస్టుల్లో అతడి అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు. టీమిండియా తరఫున రెండు వన్డేలు కూడా ఆడాడు.

ఇదీ చదవండి: వరల్డ్ టూర్ ఫైనల్స్​లో సింధు క్లిష్టమైన గ్రూపులో

Last Updated : Dec 9, 2019, 11:56 PM IST

ABOUT THE AUTHOR

...view details