'ఐసీసీ టీమ్ ఆఫ్ ది డెకెడ్' అవార్డుల జాబితాను ప్రకటించిన ఐసీసీపై ఫన్నీ ట్వీట్ చేశాడు భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్. దశాబ్దపు ఉత్తమ టీ20 జట్టు ఎంపికపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. "కేవలం ముగ్గురు ఫ్రంట్లైన్ బౌలర్లా? హే ధోనీ.. ఎవరు ఈ జట్టును ఎంపిక చేసింది?.. కచ్చితంగా ఇది సరైన జట్టు కాదు" అంటూ ధోనీ ఫొటోను జత చేశాడు. ఈ ట్వీట్ కాస్త వైరల్గా మారింది. ఈ జట్టులో ప్రధాన బౌలర్లుగా రషీద్ ఖాన్, జస్ప్రిత్ బుమ్రా, లసిత్ మలింగ ఉన్నారు.
అలాగే కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. ఈ జట్టులోని ఆటగాళ్ల ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. "ముగ్గురు బౌలర్లతో జట్టును ముందుకు నడిపించేందుకు ధోనీ నిరాకరిస్తాడు" అని చోప్రా అన్నాడు.