తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టెయిలెండర్ల ఆట నన్ను నిరాశ పర్చింది' - వాషింగ్టన్ సుందర్

ఇంగ్లాండ్‌తో చివరి టెస్టులో టెయిలెండర్ల ఆటతీరుపై వాషింగ్టన్‌ సుందర్‌ తండ్రి ఎం.సుందర్‌ విచారం వ్యక్తం చేశారు. కొద్దిసేపు క్రీజులో నిలవలేకపోవడం తనను నిరాశకు గురిచేసిందని తెలిపారు.

washington-sundars-father-disappointed-by-tailendors
'టెయిలెండర్ల ఆట నన్ను నిరాశ పర్చింది'

By

Published : Mar 7, 2021, 12:28 PM IST

Updated : Mar 7, 2021, 1:06 PM IST

ఇంగ్లాండ్​తో సిరీస్​లో వాషింగ్టన్​ సుందర్​ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోవడంపై ​అతడి తండ్రి ఎం.సుందర్​ స్పందించారు. టెయిలెండర్లు కొద్దీ సేపు కూడా క్రీజులో నిలువకుండా ఔట్ కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

"నాల్గో టెస్టులో టెయిలెండర్ల ఆట పట్ల నిరాశగా ఉంది. వాళ్లు కొద్ది సేపైనా క్రీజులో నిలువలేకపోయారు. భారత్​ మరో 10 పరుగులు చేయాల్సిన స్థితిలో కూడా వీరిలాగే ఆడతారా? ఇది పెద్ద తప్పు కాకపోవచ్చు. కానీ, లక్షల మంది ఈ మ్యాచ్​ను చూశారు. టెయిలెండర్ల ఆట నుంచి వారేం నేర్చుకోవాలి?"

-ఎం.సుందర్​, వాషింగ్టన్ సుందర్ తండ్రి.

"అప్పటికే ఇంగ్లాండ్​ జట్టు బౌలర్లు అలసిపోయి ఉన్నారు. స్టోక్స్​ 123-126 సగటు వేగంతో బౌలింగ్​ చేశాడు. టెయిలెండర్లు.. వారి బ్యాటింగ్​లో టెక్నిక్​, నైపుణ్యం ప్రదర్శించాల్సిన పని లేదు. కొంచెం తెగువతో క్రీజులో నిలబడితే సరిపోయేది" అని ఎం.సుందర్ పేర్కొన్నారు.

వాషింగ్టన్​ బ్యాటింగ్​పై వస్తున్న వ్యాఖ్యలపైనా ఎం.సుందర్​ స్పందించాడు. 'వాషింగ్టన్ బ్యాటింగ్ చూసి ప్రజలెందుకు ఆశ్చర్యపోతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. టీమ్​ఇండియా ఎలా ఆడాలని చెప్పినా.. ఆడేందుకు అతడు సిద్ధం' అని ఆయన తెలిపారు.

ఈ సిరీస్​లో 90.50 సగటుతో 181 పరుగులు చేసిన వాషింగ్టన్​.. తొలి, చివరి టెస్టుల్లో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. చెన్నై టెస్టులో 85* పరుగులు, మొతేరా టెస్టులో 96* పరుగులు చేశాడు. ఈ రెండు సందర్భాల్లో టెయిలెండర్లు త్వరగా పెవిలియన్​ చేరారు.

ఇదీ చదవండి:అదే ఎక్కువ సంతోషాన్నిచ్చింది: కోహ్లీ

Last Updated : Mar 7, 2021, 1:06 PM IST

ABOUT THE AUTHOR

...view details