టీమ్ఇండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్.. గతేడాది జరిగిన ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో తన వంతు పాత్ర పోషించాడు. గబ్బా మైదానంలో తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. అందుకు గుర్తుగా తన కుక్క పిల్లకు 'గబ్బా' అని పేరు పెట్టాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా పంచకున్నాడు.
సుందర్ కుక్కపిల్లకు క్రికెట్ స్టేడియం పేరు - cricket news
తాను టెస్టు అరంగేట్రం చేసిన గబ్బా మైదానం పేరు, తన కుక్క పిల్లకు పెట్టినట్లు యువ క్రికెటర్ సుందర్ వెల్లడించాడు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
సుందర్ కుక్కపిల్లకు క్రికెట్ స్టేడియం పేరు
గత 32 ఏళ్లలో ఆసీస్‌పై గెలిచిన జట్టు భారత్ మాత్రమే. ఆ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు సహా నాలుగు వికెట్లు తీశాడు సుందర్. రెండో ఇన్నింగ్స్‌లో పంత్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్(22 బంతుల్లో 29 పరుగుల) ఆడాడు. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. అనంతరం సిరీస్‌ను 2-1తేడాతో సొంతం చేసుకుంది.
Last Updated : Apr 4, 2021, 8:38 PM IST