2019లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఒకానొక సందర్భంలో తన చేయి విరగాలని కోరుకున్నానన్నాడు ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. అలా అయితే ఆటకు కొన్ని రోజులు విరామం తీసుకోవచ్చనే అభిప్రాయంతో ఇలా అనుకున్నానని చెప్పాడు.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా షాన్‌మార్ష్, తన మోచేతిని ఢీకొట్టినప్పుడు ఇలా జరగాలని కోరుకున్నట్లు మ్యాక్స్‌వెల్ చెప్పాడు.
ప్రపంచకప్ తర్వాత శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడిన ఆసీస్ జట్టులో ఉన్నాడు మ్యాక్స్‌వెల్. ఇందులో బ్యాటింగ్‌లో ఆకట్టుకున్నాడు. 2-0 తేడాతో ఈ సిరీస్‌ను కైవసం చేసుకున్నారు కంగారూలు.
ఈ సిరీస్ తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నట్లు సహచరులతో చెప్పాడు మ్యాక్స్‌వెల్. ఈ విషయంపై వారు సానుకూలంగా స్పందించారని అన్నాడు. బ్రేక్ తీసుకున్న కొన్నాళ్ల తర్వాత బిగ్‌బాష్ లీగ్‌లో పాల్గొన్న ఇతడు.. మెల్బోర్న్ స్టార్స్ జట్టు రన్నర్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇదీ చదవండి:కరోనాతో సంబంధం లేకుండా ఐపీఎల్ ప్రాక్టీస్‌లో స్టోక్స్