ఐపీఎల్, ప్రపంచకప్‌లో సత్తాచాటిన వార్నర్ యాషెస్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. వరుసగా మూడు సార్లు డకౌట్ అయ్యాడు. ఈ సిరీస్‌లో ఆరుసార్లు ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ చేతిలో ఖంగుతిన్నాడు.
ట్రాక్ రికార్డు...
- తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో 2, 8 పరుగులు చేసిన ఆసీస్ బ్యాట్స్‌మెన్ వార్నర్‌ను.. ఇంగ్లాండ్ పేసర్ బ్రాడ్ పెవిలియన్ చేర్చాడు.
- రెండో టెస్టులో 3, 5 పరుగులు చేసిన ఈ బ్యాట్స్‌మెన్.. తొలి ఇన్నింగ్స్‌లో బ్రాడ్‌కు, రెండో ఇన్నింగ్స్‌లో ఆర్చర్‌కు చిక్కాడు.
- మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 61 పరుగులు చేసి కాస్త ఫర్వాలేదనిపించినా మళ్లీ ఆర్చర్ బౌలింగ్‌లో ఖంగుతిన్నాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు.
- నాలుగో టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బ్రాడ్ బౌలింగ్‌లోనే డకౌటై నిరాశపర్చాడు.