ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల కోసం చాలా మంది ప్రముఖులు తమ ఆపన్న హస్తాన్ని అందజేస్తున్నారు. ఆసీస్ క్రికెటర్లు గ్లెన్ మ్యాక్స్‌వెల్, క్రిస్‌లిన్, షేన్ వార్న్ లాంటి వారు తమ వంతు సాయం అందించారు. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా ముందుకు వచ్చింది. బాధితులను ఆదుకునేందుకు విరాళాల సేకరణ కోసం ఓ ఛారిటీ మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించింది.
ఆ దేశ మాజీ ఆటగాళ్లు షేన్ వార్న్, రికీ పాంటింగ్ ఈ మ్యాచ్‌కు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. బిగ్‌బాష్ లీగ్ ఫైనల్ రోజున ఈ మ్యాచ్ జరగనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. మెల్బోర్న్ లేదా సిడ్నీల్లో ఈ మ్యాచ్ జరగనుంది.