తెలంగాణ

telangana

ETV Bharat / sports

'గంభీర్​, అఫ్రిదీ.. గొడవలు ఆపేయండి' - పాకిస్థాన్​ బౌలింగ్​ కోచ్​ వాకర్​ యూనిస్​

మాజీ క్రికెటర్లు గంభీర్​, అఫ్రిదీలు సామాజిక మాధ్యమాల్లో వాగ్వివాదాన్ని ఆపేయాలని సూచించాడు పాకిస్థాన్​ బౌలింగ్​ కోచ్​ వకార్​ యూనిస్​. వారిద్దరు కొంచెం తెలివిగా వ్యవహరించాలని కోరాడు. సమస్య పరిష్కారం కోసం ప్రపంచంలో ఎక్కడైనా కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

Waqar Younis urges Afridi and Gambhir to act sensibly on social media
'గంభీర్​, అఫ్రిదీ.. మీరు కొంచెం తెలివిగా ఆలోచించండి'

By

Published : Jun 1, 2020, 4:06 PM IST

మాజీ క్రికెటర్లు షాహిద్​ అఫ్రిదీ(పాకిస్థాన్​), గౌతమ్​ గంభీర్​ (భారత్​)లు కొంచెం తెలివిగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశాడు పాకిస్థాన్​ బౌలింగ్​ కోచ్​ వకార్​ యూనిస్​. ప్రస్తుత రాజకీయలతో సహా క్రికెట్​కు సంబంధించిన అంశాలపై సోషల్​మీడియాలో వాగ్వివాదానికి దిగుతున్న వీరిద్దరినీ శాంతించమని యూనిస్​ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

"గంభీర్​, అఫ్రిదీల మధ్య వాగ్వివాదం కొన్నేళ్లుగా సాగుతోంది. అయితే వారిద్దరూ కొంత ప్రశాంతంగా, తెలివిగా ప్రవర్తించాలని భావిస్తున్నా. మీరు ఇలానే గొడవ పడటం వల్ల ప్రజలు మిమ్మల్ని చూసి ఆనందిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా కలుసుకొని మీరు మాట్లాడుకోవచ్చని నా సలహా".

- వకార్​ యూనిస్​, పాకిస్థాన్​ బౌలింగ్​ కోచ్​

భారత్​, పాకిస్థాన్​ కలిసి త్వరలోనే ఓ ద్వైపాక్షిక సిరీస్​ను నిర్వహించాలని సూచించాడు వకార్. ఈ సిరీస్​ జరగాలని 95 శాతం మంది కోరుకుంటున్నట్లు తెలిపాడు​. భవిష్యత్​లో ఇరు దేశాల క్రికెట్​ జట్లు కలిసి ఒకే మైదానంలో కచ్చితంగా ఆడతారని ఆశాభావం వ్యక్తం చేశాడీ మాజీ ఆటగాడు​.

అఫ్రిదీ.. ఇటీవలే ప్రధాని నరేంద్రమోదీపై అవాంఛనీయ వ్యాఖ్యలు చేయడం వల్ల భారత క్రికెటర్లు గంభీర్, యువరాజ్ సింగ్​, హర్భజన్​ సింగ్​, శిఖర్​ ధావన్​లు అతడిపై సోషల్​మీడియాలో ఘాటుగా స్పందించారు.

"ఆటిట్యూడ్ చూపిస్తాడు కానీ, వ్యక్తిగత రికార్డులేవీ లేని క్రికెటర్​" అని గంభీర్​ గురించి ప్రస్తావిస్తూ అఫ్రిదీ తన బయోగ్రఫీలో వ్యంగ్యంగా పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన గంభీర్​ అఫ్రిదీని మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్తానని బదులిచ్చాడు.

ఇదీ చూడండి... సంపాదనలో పురుష క్రికెటర్లతో భారత మహిళలు పోటీ

ABOUT THE AUTHOR

...view details