తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫార్మాట్​ స్పెషలిస్టు కావాలనుకోవట్లేదు: కోహ్లీ - viratkohli

అన్ని ఫార్మాట్లలో ఒకే విధంగా రాణించాలనుకున్నట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు.  ఫార్మాట్​ స్పెషలిస్టుగా ఉండాలనుకోవట్లేదని అన్నాడు.

వెస్టిండీస్​తో టీ20లో విరాట్​ కోహ్లీ సిగ్నేచర్
విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్

By

Published : Dec 8, 2019, 6:31 AM IST

వెస్టిండీస్​తో తొలి టీ20లో అద్భుత బ్యాటింగ్​తో ఆకట్టుకున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.94 పరుగులతో ఈ ఫార్మాట్​లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. 6 వికెట్ల తేడాతో జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. భారత్.. ఇప్పటివరకు ఆడిన టీ20ల్లో ఇదే అత్యుత్తమ ఛేదన. ఈ మ్యాచ్​లో తన బ్యాటింగ్​ గురించి కోహ్లీ మాట్లాడాడు. తన ఆట తొలి అర్ధభాగాన్ని యువ ఆటగాళ్లు ఫాలో కావొద్దని అన్నాడు.

"మూడు ఫార్మాట్లలో ఆడుతున్నందున నా ఆటతీరు మార్చుకోవాలనుకోవట్లేదు. అదే విధంగా ఫార్మాట్​ స్పెషలిస్టుగా నాపై ముద్ర ఉండకూడదని అనుకుంటున్నా. భారీ స్కోరు ఛేదనకు దిగినప్పుడు ఒత్తిడిలో దృష్టి మళ్లే అవకాశం ఉంటుంది. క్రీజులో కుదురుకున్నాక షాట్లతో విరుచుకుపడొచ్చు" -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్

టీ20ల్లో 12వ సారి మ్యాన్​ ఆఫ్ ద మ్యాచ్​ అవార్డు అందుకున్న కోహ్లీ.. అఫ్గానిస్థాన్ ఆల్​రౌండర్​ నబీని సమం చేశాడు. వీరి తర్వాత పాక్ మాజీ క్రికెటర్ షాహిద్​ అఫ్రిది(11) ఉన్నాడు.

వెస్టిండీస్​తో టీ20లో విరాట్​ కోహ్లీ సిగ్నేచర్

టీ20 సిరీస్​లో భాగంగా నేడు(ఆదివారం) భారత్​-వెస్టిండీస్ మధ్య రెండో టీ20 తిరువనంతపురంలో జరగనుంది. ఇందులో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా.. ప్రతీకారం తీర్చుకోవాలని విండీస్ చూస్తున్నాయి.​​

ABOUT THE AUTHOR

...view details