హోరాహోరీగా సాగుతున్న బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో రసవత్తర సమరానికి వేళైంది. శుక్రవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. సిరీస్ 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో మ్యాచుపై ఉత్కంఠత ఏర్పడింది. గత మ్యాచు ఫలితంగా ఆత్మవిశ్వాసం, గాయాలతో బాధతో భారత్ బరిలోకి దిగుతుంటే.. గొప్ప రికార్డున్న గబ్బాలో మరోసారి తమదే పైచేయి అవుతుందన్న ధీమాతో ఆతిథ్య జట్టు పోరుకు సిద్ధమైంది. మరి సిరీస్ ఎవరి సొంతమవుతుందో?
భారత ఆటగాళ్లు ఎలా రాణిస్తారో!
నాలుగు టెస్టుల బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లో చివరి మ్యాచుకు భారత జట్టు సిద్ధమైంది. అడిలైడ్ టెస్టులో ఓటమి పాలైనప్పటికీ.. మెల్‌బోర్న్ మ్యాచులో గెలిచి.. ఆ తర్వాత సిడ్నీ టెస్టు డ్రాగా ముగించిన టీమ్ఇండియా.. నాలుగో పోరులో గెలవాలనే పట్టుదలతో ఉంది. సారథి కోహ్లీ పితృత్వ సెలవుపై వెళ్లిన తర్వాత అజింక్య రహానె సారథ్యంలో ఓ టెస్టు గెలిచి, మరో మ్యాచును డ్రా చేసుకున్న ఉత్సాహంతో శుక్రవారం నిర్ణయాత్మక మ్యాచుకు సన్నద్ధమవుతోంది. సిడ్నీలో ఓడుతుందనుకున్న మ్యాచును పూజారా, పంత్, విహారి, అశ్విన్ వీరోచిత బ్యాటింగ్‌తో డ్రా చేశారు. బౌలర్లకు అనుకూలించే బ్రిస్బేన్‌లో భారత్ ఎలా ఆడతుందనే అంశం ఉత్కంఠ రేపుతోంది. ప్రధానంగా కేఎల్ రాహుల్, విహారి లాంటి బ్యాట్స్‌మెన్, పేసర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమి, ఆల్‌రౌండర్ జడేజాలు గాయాలతో ఇప్పటికే జట్టుకు దూరమైన వేళ.. టీమ్ఇండియా ఆటగాళ్లు ఎలా రాణిస్తారనే అంశంపై ఆసక్తి కలిగిస్తోంది.
తమవద్దే ఉంచుకోవాలని