తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచకప్​ గెలుపు.. గుండుతో ధోనీ.. ఆటగాళ్లు షాక్

2011 ప్రపంచకప్​ గెల్చుకున్న తర్వాత రోజు ధోనీ గుండుతో కనిపించాడు. అదే విషయాన్ని గుర్తు చేసుకున్న అప్పటి జట్టు మేనేజర్.. దాని గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.

By

Published : Apr 2, 2021, 5:23 PM IST

Waking up to see Dhoni's shaved head biggest surprise of 2011 WC journey for us: Manager Ranjib Biswal
ప్రపంచకప్​ గెలుపు.. గుండుతో ధోనీ.. ఏంటి కథ?

భారత్-శ్రీలంక మధ్య వన్డే ప్రపంచకప్ ఫైనల్.. కులశేఖర బౌలింగ్​లో సిక్స్​ కొట్టిన ధోనీ.. దేశం మొత్తం సంబరాలు.. మైదానంలో సచిన్​ను భుజాలపై ఎత్తుకుని తిరిగిన భారత క్రికెటర్లు.. ఇవన్నీ మొన్న మొన్న జరిగినట్లే ఉన్నాయి కానీ వీటికి అప్పుడే పదేళ్లు పూర్తయిందంటే నమ్మలేకపోతున్నాం.​ ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్న అప్పటి టీమ్​ఇండియా మేనేజర్​ రంజీబ్ బిస్వాల్.. ధోనీ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

2011 ప్రపంచకప్ విజేతగా భారత్

"మ్యాచ్​ గెలిచిన తర్వాత ఉదయం 4:30 గంటలకు వరకు జట్టులోని ఆటగాళ్లందరూ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఎవరి గదుల్లోకి వారు వెళ్లిపోయారు. అయితే ఉదయం లేచి చూసేసరికి ధోనీ గుండుతో కనిపించాడు. దానికి కారణం తెలియనప్పటికీ.. ఆ సంఘటన మాత్రం మాతో ఎప్పటికీ నిలిచిపోతుంది" అని బిస్వాల్ చెప్పారు.

ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన లంక.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. అనంతరం 48.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది టీమ్​ఇండియా. ధోనీ కొట్టిన గెలుపు సిక్స్​ను ఇప్పటికీ అభిమానులు గుర్తు చేసుకుంటూనే ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.

2011 ప్రపంచకప్

ABOUT THE AUTHOR

...view details