భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. బంగ్లాదేశ్ అండర్-16 నుంచి అండర్-19 జట్లలోని యువ క్రికెటర్లకు జాఫర్ బ్యాటింగ్ శిక్షణ ఇవ్వనున్నాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఒప్పందం ప్రకారం మే నెల నుంచి ఏప్రిల్ 2020 వరకు బంగ్లాలోని మీర్పూలో ఉన్న క్రికెట్ అకాడమీలో జాఫర్ బ్యాటింగ్ కోచ్గా సేవలందిస్తాడు.
బంగ్లా యువ క్రికెటర్లకు జాఫర్ పాఠాలు - వసీం జాఫర్
భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఇక నుంచి బంగ్లా దేశ్ యువ క్రికెటర్లకు బ్యాటింగ్ పాఠాలు నేర్పనున్నాడు. ఈ విషయాన్ని బీసీబీ ప్రకటించింది. అండర్- 16 నుంచి అండర్- 19 జట్లలోని క్రికెటర్లకు ఏడాది పాటు శిక్షణ అందిస్తాడు జాఫర్.
బంగ్లా ఆటగాళ్లకు వసీం క్రికెట్ పాఠాలు
రంజీల్లో 19 సీజన్లు ముంబయికు ప్రాతినిథ్యం వహించిన జాఫర్ తర్వాత విదర్భ తరఫున ఆడాడు. వరుసగా రెండు రంజీ టైటిల్స్ సాధించిన విదర్భ జట్టులో జాఫర్ సభ్యుడు. భారత్ తరఫున 31 టెస్టు మ్యాచ్‌లు ఆడిన జాఫర్ 1,944 పరుగులు చేశాడు. ఈ మాజీ ఓపెనర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 212 పరుగులు.