లేహ్‌కు చెందిన ఖిఫాయత్ హుస్సేన్ అనే గణితశాస్త్ర ఉపాధ్యాయుడి తపన స్ఫూర్తిదాయకమని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. కరోనా సోకడం వల్ల ఐసోలేషన్ వార్డులో ఉన్నప్పటికీ తన విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు చెబుతున్నాడని ప్రశంసించాడు.
ఆయన తపన స్ఫూర్తి దాయకమైనది: లక్ష్మణ్ - లేహ్ గణిత ఉపాధ్యాయుడు ఖిఫాయత్ హుస్సేన్
కరోనా సోకి ఐసోలేషన్‌లో ఉన్నా తన విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్న ఓ గణిత బోధకుడి గురించి మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. అతని తపన స్ఫూర్తిదాయకమని కొనియాడాడు.
ఆయన తపన స్ఫూర్తి దాయకమైనది: లక్ష్మణ్
"లేహ్‌కు చెందిన గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు ఖిఫాయత్ హుస్సేన్‌కు కరోనా ఉందని తేలింది. అయినప్పటికీ అతను ఐసోలేషన్ వార్డులో ఉంటూ తన విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు బోధిస్తున్నాడు. అతని తపన స్ఫూర్తిదాయకం" అని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు.
ఇదీ చూడండి.. భీకర బౌలర్లను హెల్మెట్ లేకుండా ఎదుర్కొన్నాడు!