తెలంగాణ

telangana

ETV Bharat / sports

రంజీ ఫైనల్: సౌరాష్ట్ర 206/5.. పుజారా రిటైర్డ్​హర్ట్ - చేతేశ్వర్​ పుజారా న్యూస్​

రంజీట్రోఫీ ఫైనల్​ మ్యాచ్​ బంగాల్​, సౌరాష్ట్ర జట్ల మధ్య సోమవారం ప్రారంభమైంది. టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న సౌరాష్ట్ర.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.

Visiting Bengal ahead against Saurashtra after late strike
జ్వరంతో రిటైర్డ్​ హర్ట్​గా వెనుదిరిగిన టెస్టు స్పెషలిస్టు

By

Published : Mar 9, 2020, 7:50 PM IST

రాజ్​కోట్ వేదికగా సోమవారం ప్రారంభమైన రంజీట్రోఫీ ఫైనల్​లో బంగాల్, సౌరాష్ట్ర జట్లు తలపడుతున్నాయి. టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఆతిథ్య జట్టు మొదటి రోజు ఆట పూర్తయ్యే సమయానికి 5 వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేసింది.

సౌరాష్ట్ర జట్టు

బరోట్ (54), విశ్వరాజ్ జడేజా (54) అర్ధసెంచరీలతో రాణించారు. హర్విక్ దేశాయ్ (38) ఫర్వాలేదనిపించాడు. చేతన్ సకారియా (4), షెల్డన్ జాక్సన్ (14) విఫలమయ్యారు. ఫలితంగా మొదటిరోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర 206 పరుగులు చేసింది.

జ్వరంతో బాధ పడుతున్న పుజారా

టీమిండియా టెస్టు స్పెషలిస్టు చెతేశ్వర్​ పుజారా.. ఈ మ్యాచ్​లో సొంత టీమ్​ సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహించాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఈ క్రికెటర్.. రిటైర్డ్​ హర్ట్​గా వెనుదిరిగాడు. 24 బంతుల్లో 5 పరుగులు చేసి మైదానాన్ని వీడాడు. రెండోరోజు పుజారా ఆట కొనసాగిస్తాడని ఆ జట్టు కెప్టెన్​ జయదేవ్​ ఉనద్కత్​ వెల్లడించాడు.

ఇదీ చూడండి.. రంజీట్రోఫీ ఫైనల్లో టీమిండియా టెస్టు స్పెషలిస్టు

ABOUT THE AUTHOR

...view details