ఈడెన్ గార్డెన్స్ వేదికగాభారత ఆడే తొలి డై అండ్ నైట్.. ఈ నెల 22న ఆరంభం కానుంది. దీని గురించి టీమిండియా క్రికెటర్ చతేశ్వర్ పుజారా మాట్లాడాడు. రాత్రిపూట గులాబి బంతితో ఆడేటపుడు క్రికెటర్లకు కాస్త ఇబ్బంది తలెత్తుతుందని అన్నాడు.
"నేను గతంలో దులీప్ ట్రోఫీలో గులాబి బంతితో ఆడా. ఆ అనుభవమే సహకరిస్తుందని అనుకుంటున్నా. పగటిపూట ఆడేటపుడు బంతి కనపడకపోవడం జరగదు. ఫ్లడ్లైట్ల వెలుగులో కొంచెం ఇబ్బంది తలెత్తొచ్చు" -చతేశ్వర్ పుజారా, టీమిండియా క్రికెటర్.
జట్టులో చాలా మంది క్రికెటర్లకు గులాబీ బంతితో ఆడటం ఇదే తొలిసారి కానుందని చెప్పాడు పుజారా.
"గులాబి బంతితో ఆడడం కొత్త ఛాలెంజ్. ఆటలో ఏం జరుగుతుందో మాకు తెలియదు. మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సెషన్లు ఉన్నాయి. కాబట్టి ఈ బంతిపై ఓ అంచనాకు రావొచ్చు. చాలా మంది క్రికెటర్లు ఈ బంతితో తొలిసారి ఆడనున్నారు" -చతేశ్వర్ పుజారా, టీమిండియా క్రికెటర్.