ముంబయిలో జరిగిన ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ అవార్డుల కార్యక్రమంలో తళుక్కున మెరిశారు విరాట్ కోహ్లీ - అనుష్కశర్మ దంపతులు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో పంచుకుంది అనుష్క. హార్ట్ ఎమోజీతో పోస్ట్ చేసింది.
ఫిబ్రవరిలోనే ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా పుల్వామా ఘటనలో అమరులైన జవాన్ల గౌరవార్థం వాయిదా పడింది. క్రీడారంగంలో విశేష సేవనందించినందుకు 11 విభాగాల్లో పురస్కారాలు అందజేస్తారు. విరాట్ కోహ్లీ ఫౌండేషన్, ఆర్పీ సంజీవ్ గొయెంకా గ్రూప్ సంయుక్తంగా ఏటా ఈ అవార్డులను అందిస్తున్నాయి.