తెలంగాణ

telangana

ETV Bharat / sports

పీఎస్​ఎల్​: ఆగిపోయిన మ్యాచ్​లు మళ్లీ జూన్​లోనే! - జూన్​లో తిరిగి ప్రారంభం కానున్న పాకిస్తాన్​ సూపర్​లీగ్

ఫిబ్రవరి 20న అట్టహాసంగా ప్రారంభమైన పాకిస్థాన్​ సూపర్​ లీగ్​లో ఆరు కొవిడ్​ కేసులు వచ్చిన తర్వాత టోర్నీని అర్ధాంతరంగా నిలిపేశారు. దీంతో లీగ్​లో మిగిలిన మ్యాచ్​లను తిరిగి జూన్​లో నిర్వహించనున్నట్లు పీసీబీ గురువారం వెల్లడించింది.

Virus-affected Pakistan Super League to resume in June
పీఎస్​ఎల్​: ఆగిపోయిన మ్యాచ్​లు మళ్లీ జూన్​లో!

By

Published : Mar 11, 2021, 7:50 PM IST

కరోనా కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన పాకిస్థాన్​ సూపర్​లీగ్​ను తిరిగి నిర్వహించేందుకు​ పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు సన్నాహాలు చేస్తోంది. టోర్నీలో పాల్గొన్న ఆరుగురికి కరోనా సోకిన తర్వాత.. గతవారమే లీగ్​ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ఆ​ బోర్డు ప్రకటించింది.

అయితే టోర్నీ తిరిగి ఎప్పుడు ప్రారంభించాలనే విషయంపై పీసీబీ నేతృత్వంలో ఆరు ఫ్రాంచైజీలు గురువారం సమావేశమయ్యాయి. ఈ ఏడాది జూన్​ 26న పాక్​ జట్టు ఇంగ్లాండ్​ పర్యటన వెళ్లనున్న సందర్భంగా అంతకంటే ముందే టోర్నీలో ఆగిపోయిన మ్యాచ్​లను నిర్వహించాలని పీసీబీ భావించినట్లు తెలుస్తోంది. అయితే లీగ్​లో మిగిలిన 20 మ్యాచ్​లను కరాచీ వేదికగా నిర్వహించనున్నట్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:పీఎస్​ఎల్​లో మరో ముగ్గురికి కరోనా.. టోర్నీ వాయిదా

ABOUT THE AUTHOR

...view details