టీమ్‌ఇండియా డాషింగ్ ఓపెనర్, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంటిపై శనివారం మిడతల దండు దాడి చేసింది. ఈరోజు ఉదయం నుంచీ గురుగ్రామ్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో మిడతలు బాగా విస్తరిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రమే అధికారులు అక్కడి నివాసితులకు హెచ్చరికలు జారీ చేశారు. ఏ సమయంలోనైనా మిడతలు దాడి చేయొచ్చని ప్రజలంతా తమ ఇళ్ల కిటికీలను, తలుపులను మూసిపెట్టుకోవాలని జాగ్రత్తలు చెప్పారు.
అదుగో మిడతల దండు.. సెహ్వాగ్ వీడియో పోస్ట్ - మిడతల దండు తాజా వార్తలు
టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంటిపై మిడతల దండు దాడి చేసింది. ఈ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడీ మాజీ ఓపెనర్.
![అదుగో మిడతల దండు.. సెహ్వాగ్ వీడియో పోస్ట్ Virender Sehwag Shared Locusts attack right above his house in Delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7797626-thumbnail-3x2-seh.jpg)
సెహ్వాగ్
ఈ నేపథ్యంలోనే మిడతలు గురుగ్రామ్‌నే కాకుండా దిల్లీ పరిసర ప్రాంతాలను చుట్టుముట్టాయి. దీంతో అవి సెహ్వాగ్ ఇంటివైపు కూడా వెళ్లినట్లు అతడు పోస్టు చేసిన వీడియో ద్వారా తెలిసింది. ఆకాశంలో గుంపుగా విహరిస్తున్న మిడతల దండును సెహ్వాగ్ వీడియోగా తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేశాడు.
సెహ్వాగ్ ఇటీవల లాక్‌డౌన్ వేళ ఎంతోమంది పేదలకు భోజన సదుపాయాలు కల్పించాడు. స్వయంగా తనే వండి అన్నార్తుల ఆకలి తీర్చాడు. ఆ చిత్రాలను కూడా మాజీ ఓపెనర్ ఇన్‌స్టాలో పంచుకున్నాడు.