భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా ఇటీవలే సౌరభ్ గంగూలీ బాధ్యతలు చేపట్టాడు. అయితే ఇది తాను ముందే ఊహించానని, దాదా బీసీసీఐ అధ్యక్షుడు అవుతాడని 2007లోనే చెప్పానని అంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.
"2007లో దక్షిణాఫ్రికా పర్యటనలో ఈ విషయం(గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు అయ్యే అంశం) గురించి చెప్పా. అప్పుడు కేప్‌టౌన్ వేదికగా టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఓపెనర్ వసీం జాఫర్ త్వరగా ఔటయ్యాడు. తెందూల్కర్ నాలుగో స్థానంలో దిగుతానని చెప్పాడు. ఆ సమయంలో జట్టుపై ఎంతో ఒత్తిడి ఉంది. అలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు దిగిన గంగూలీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో నా సహచరులతో ఈ విషయం పంచుకున్నా. మనలో బీసీసీఐ అధ్యక్షుడు అయ్యే అవకాశం గంగూలీకే ఉందని వారితో అన్నా. ఇప్పుడు అదే నిజమైంది" - వీరేంద్ర సెహ్వాగ్, టీమిండియా మాజీ క్రికెటర్
గంగూలీ గురించి రెండు అనుకుంటే ఒకటి నిజమైందని, ఇంకొక్కటి మాత్రమే మిగిలి ఉందని చెప్పాడు సెహ్వాగ్.