తెలంగాణ

telangana

ETV Bharat / sports

విరాట్ కోహ్లీ​ కసరత్తులకు నెటిజన్లు ఫిదా - షమి ఇన్​స్టా ఫోటోలు

శారీరక కసరత్తులు చేస్తూ భారత జట్టు సారతి విరాట్ కోహ్లీ పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి. పోస్టు చేసిన మూడు గంటల్లోనే లక్ష మందికి పైగా లైక్​ కొట్టడం విశేషం.

Virat Kohli
వైరల్​ అవుతోన్న విరాట్​ ఫోటోలు!

By

Published : Nov 22, 2020, 5:15 AM IST

గత కొన్ని రోజులుగా క్రికెట్ ప్రపంచమంతా టీమ్​ ఇండియా సారథి విరాట్ కోహ్లీ గురించే చర్చిస్తోంది. దానికి కారణం పితృత్వ సెలవులపై ఆస్ట్రేలియాతో చివరి మూడు టెస్టులకు విరాట్ దూరమవ్వడం. కోహ్లీ గైర్హాజరీ భారత జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఆసీస్‌కు సానుకూలాంశం అవుతుందని చర్చలు జోరుగా సాగుతున్నాయి. కోహ్లీ జట్టులో లేకపోయినా టీమిండియా గొప్ప ప్రదర్శన చేస్తుందని కొందరు అభిప్రాయపడుతుండగా.. మరికొందరు టెస్టు సిరీస్‌ను 1-2తో టీమిండియా చేజార్చుకోవచ్చని జోస్యం చెబుతున్నారు.

విరాట్ కోహ్లీ

దృష్టంతా ఆటపైనే

కోహ్లీ మాత్రం తన దృష్టంతా ఆటపైనే ఉంచాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు ఇటీవల పోస్ట్ చేశాడు. తాజాగా శారీరక కసరత్తులు చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. దీనికి 'ఇంధనం సమకూర్చుకుంటున్నా' అని వ్యాఖ్య జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. పోస్ట్ చేసిన మూడు గంటల్లోనే రెండు లక్షల మందికి పైగా లైకులు కొట్టారు.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ

కోహ్లీతో పాటు పేసర్ మహ్మద్‌ షమి కూడా జిమ్‌ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. తినడం, లిఫ్టింగ్ అంటే తనకి ఎంతో ఇష్టమని దానికి వ్యాఖ్య జోడించాడు. ఆస్ట్రేలియాతో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 27న సిడ్నీ వేదికగా తొలి వన్డే జరగనుంది.

ఇదీ చదవండి:'ఐపీఎల్​కు భారీ రేటింగ్ వచ్చింది సెహ్వాగ్​ వల్లే'

ABOUT THE AUTHOR

...view details