తెలంగాణ

telangana

ETV Bharat / sports

మూగజీవాల సంరక్షణ కోసం కోహ్లీ సహాయం - కోహ్లీ ఐపీఎల్

ముంబయిలోని సరైన ఆవాసం లేని మూగజీవాల కోసం కోహ్లీ నడుంబిగించాడు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి వాటికి ఆశ్రయం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాడు.

Virat Kohli's foundation to build shelter for animals in Mumbai
మూగజీవాల పట్ల కోహ్లీ మంచి మనసు

By

Published : Apr 4, 2021, 3:19 PM IST

మైదానంలో దూకుడుగా, ప్రత్యర్థి జట్లపై హోరాహోరీగా బ్యాటింగ్​ చేసే టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీ.. మూగజీవాల పట్ల ప్రేమను చాటుకున్నాడు. తన స్వచ్ఛంద సంస్థ ద్వారా వాటి కోసం రెండు చోట్ల ఆశ్రయం కల్పించేందుకు సిద్ధమయ్యాడు. ముంబయి పరిసర ప్రాంతాల్లోని మలడ్, బోయిసర్​లో వీటిని నిర్మించనున్నారు.

ఇందుకోసం కోహ్లీ ఆవాజ్ సంస్థతో కలిసి ఈ మంచిపనికి శ్రీకారం చుట్టబోతున్నాడు. మలద్​లో జంతువల కోసం తాత్కాలిక పునరావస కేంద్రం ఏర్పాటు చేయనుండగా, కళ్లు కనబడని, కదల్లే జంతువుల కోసం బోయిసర్​లో శాశ్వత ఆశ్రయం నిర్మించనున్నారు. వాటి చికిత్స కోసం అంబులెన్స్​లను కూడా కోహ్లీ ఏర్పాటు చేయనున్నాడు.

కెప్టెన్ కోహ్లీ

"నగరంలో ఎలాంటి ఆవాసాలు లేని జంతువులకు ఆశ్రయం కల్పించాలనేది మా కల. ఈ ప్రాజెక్టులో భాగంగా మూగజీవాలకు సహాయపడటం కోసం వివిలాడ్స్, ఆవాజ్ స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది" అని కోహ్లీ చెప్పాడు.

ABOUT THE AUTHOR

...view details