తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ వైఫల్యం గురించే ఇప్పుడు చర్చంతా: లక్ష్మణ్ - sports news

కివీస్​పై భారత్ టెస్టు సిరీస్​ కోల్పోయిన నేపథ్యంలో, ఈ విషయమై తన అభిప్రాయాన్ని చెప్పాడు టీమిండియా మాజీ క్రికెటర్ లక్ష్మణ్.

కోహ్లీ వైఫల్యం గురించే ఇప్పుడు చర్చంతా: లక్ష్మణ్
కోహ్లీ లక్ష్మణ్

By

Published : Mar 2, 2020, 2:08 PM IST

Updated : Mar 3, 2020, 3:59 AM IST

న్యూజిలాండ్‌ పర్యటనలో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వైఫల్యమే ప్రధానంగా చర్చకు వస్తోందని మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. సోమవారం మాట్లాడిన ఈ క్రికెటర్... భారత్‌-కివీస్‌ పర్యటనపై తన అభిప్రాయాలను వెల్లడించాడు.

'ఈ పర్యటనలో వన్డే సిరీస్‌ నుంచి టెస్టు సిరీస్‌ వరకు చెప్పుకోదగింది ఇద్దరు ప్రధాన ఆటగాళ్ల గురించే. బ్యాటింగ్‌లో విరాట్‌ కోహ్లీ వైఫల్యం‌, బౌలింగ్‌లో బుమ్రా ‌వైఫల్యం. అయితే, టీమిండియా నిరుత్సాహ పడటానికి విరాట్‌ బ్యాటింగే ప్రధాన కారణం. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అయిన అతడు.. రెండు టెస్టుల్లో సాధించిన సగటు 9.50. టీమిండియాకు ఇదెంతో కష్టం. అలాగే రెండు టెస్టుల్లోనూ పోటీ ఇవ్వలేదు. మరోవైపు తొలి మ్యాచ్​లో ఒక్క వికెటే తీసిన బుమ్రా, రెండో టెస్టులో ఐదు వికెట్లతో చెలరేగాడు. క్రైస్ట్‌చర్చ్‌లో గాడిలో పడ్డాడు. ఇక్కడ లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో నిలకడగా బౌలింగ్‌ చేసి కివీస్‌ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈ రోజు మరింత అద్భుతంగా బంతులేశాడు" -వీవీఎస్ లక్ష్మణ్, మాజీ క్రికెటర్

కివీస్​తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో కోహ్లీ కేవలం 38 పరుగులే చేశాడు. అతడి సగటు 9.50 మాత్రమే. కెరీర్‌లోనే కోహ్లీకిది రెండో అత్యల్ప సగటు. అటు వన్డే, ఇటు టెస్టు సిరీస్‌లో విఫలమైన విరాట్.. 11 ఇన్నింగ్స్‌ల్లో చేసింది 218 పరుగులే. తొలి వన్డేలో మాత్రమే అర్ధశతకంతో రాణించాడు. ఇక టెస్టు సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో 2, 19 పరుగులు చేసిన కెప్టెన్‌ రెండో మ్యాచ్‌లో 3, 14 పరుగులు చేశాడు.

Last Updated : Mar 3, 2020, 3:59 AM IST

ABOUT THE AUTHOR

...view details