తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ 'ది బెస్ట్' ఇన్నింగ్స్ అదే: గంభీర్

2012 ఆసియాకప్​లో పాకిస్థాన్​పై చేసిన ఇన్నింగ్స్​.. కోహ్లీ కెరీర్​లోనే​ 'ది బెస్ట్' అని అన్నాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. ఆ మ్యాచ్​ సంగతుల్ని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

కోహ్లీ 'ది బెస్ట్' ఇన్నింగ్స్ అదే: గంభీర్
కోహ్లీ 183 పరుగుల ఇన్నింగ్స్

By

Published : Aug 1, 2020, 6:59 PM IST

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ.. ప్రపంచంలోనే ఇప్పుడు అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. ఏ ఫార్మాట్‌లో, ఏ జట్టు మీదైనా, ఎక్కడైనా పరుగుల వరద పారించగలడు. అండర్‌ 19 స్థాయిలోనే టీమ్‌ఇండియాను విశ్వవిజేతగా నిలిపిన తర్వాత జాతీయ జట్టులో స్థానం సంపాదించి రికార్డుల మోత మోగిస్తున్నాడు. తన బ్యాటింగ్‌, నాయకత్వంతో జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్నో శతకాలు, మరెన్నో రికార్డులు నెలకొల్పుతున్నాడు. ఇక 2012 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 183 పరుగుల ఇన్నింగ్సే అతడి కెరీర్‌లో 'ది బెస్ట్‌' అని మాజీ ఓపెనర్‌, భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. స్టార్‌స్పోర్ట్స్‌ కార్యక్రమంలో మాట్లాడిన అప్పటి కోహ్లీ ఇన్నింగ్స్‌ను ప్రశంసించాడు.

మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్

ఫార్మాట్లకు అతీతంగా టీమ్‌ఇండియా సారథి ఎన్నో నమ్మశక్యం కాని ఇన్నింగ్స్‌ ఆడాడని, అందులో అత్యుత్తమైనది పాకిస్థాన్‌పై సాధించిన అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ అని గంభీర్‌ గుర్తుచేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో భారత్‌ 330 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చిందని, తొలి ఓవర్‌లోనే తాను ఔటయ్యాక సచిన్ తెందూల్కర్‌‌(52), రోహిత్‌ శర్మ(68)లతో కలిసి విరాట్‌ (183) జట్టును ఆదుకున్నాడని చెప్పాడు. అప్పట్లో అంత అనుభవం లేకపోయినా కోహ్లీ.. చిరకాల ప్రత్యర్థి పాక్‌ మీద అతిగొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడని మెచ్చుకున్నాడు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌, నిర్ణీత 50 ఓవర్లలో 329/6 భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు మహ్మద్‌ హఫీజ్‌(105), జాసిర్‌ జంషెద్‌ (112) శతకాలతో చెలరేగారు. అనంతరం కోహ్లీ రెచ్చిపోడం వల్ల భారత్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 47.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

ABOUT THE AUTHOR

...view details