తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత​ క్రీడలకు మంచి భవిష్యత్తు ఉంది: కోహ్లీ

'విరాట్ కోహ్లీ ఫౌండేషన్'​ను సందర్శించిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ.. అక్కడ శిక్షణ పొందుతున్న క్రీడాకారులతో సరదాగా గడిపాడు. భారత క్రీడలకు అద్భుతమైన భవిష్యత్తు ఉందని చెప్పాడు.

By

Published : Sep 27, 2019, 9:25 PM IST

Updated : Oct 2, 2019, 6:39 AM IST

కోహ్లీ

టీమిండియా ఆటగాడు కోహ్లీ.. ఆట పట్ల ఎంత పట్టుదలతో ఉంటాడో తన ఫౌండేషన్​ పట్ల అంతే నిబద్ధతతో పనిచేస్తాడు. అతడి పేరిట ముంబయిలో ఏర్పాటు చేసిన 'విరాట్ కోహ్లీ ఫౌండేషన్'​లో ఎంతో మంది నైపుణ్యం కలిగిన అథ్లెట్లు శిక్షణ పొందుతున్నారు. క్రీడల్లో రాణిస్తున్న వారికి స్కాలర్​షిప్​లతో పాటు క్రీడాసామాగ్రిని అందిస్తున్నారు. గురువారం అక్కడికి వెళ్లిన కోహ్లీ.. క్రీడాకారులతో సరదాగా గడిపాడు.

"ఈరోజు విరాట్ కోహ్లీ ఫౌండేషన్​ అథ్లెట్లను కలవడం ఎంతో ప్రత్యేకం. క్రమశిక్షణ, సంకల్పం, అంకితభావంతోనే మనంక్రీడా దేశంగా అత్యున్నత స్థాయికి చేరుకుంటాం. భారత క్రీడలకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది. త్వరలో మళ్లీ మిమ్మల్ని కలుస్తా. జైహింద్​." -విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి

ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో సిరీస్​లో బిజీగా ఉన్నాడు కోహ్లీ. టీ20 సిరీస్​ సమం చేసుకున్న టీమిండియా.. టెస్టు సిరీస్​ కోసం సన్నద్ధమవుతోంది. వచ్చే నెల 2న తొలి టెస్టు ప్రారంభం కానుంది.

ఇవీ చూడండి.. టీ20లో డుమిని ​విశ్వరూపం... యువీ రికార్డు పదిలం

Last Updated : Oct 2, 2019, 6:39 AM IST

ABOUT THE AUTHOR

...view details