తెలంగాణ

telangana

'ప్రపంచంలోని ఏ జట్టుతో అయినా డే/నైట్​ టెస్టు ఆడగలం'

By

Published : Jan 13, 2020, 1:23 PM IST

Updated : Jan 13, 2020, 4:36 PM IST

ఆస్ట్రేలియాతో పింక్​ బాల్​ టెస్టుపై భారత జట్టు సారథి విరాట్​ కోహ్లీ పరోక్షంగా స్పందించాడు. ఏ జట్టు ఛాలెంజ్​ అయినా స్వీకరించే సత్తా టీమిండియాకు సొంతమని అభిప్రాయపడ్డాడు​. ప్రస్తుతం అన్ని ఫార్మాట్​లలో 'మెన్​ ఇన్​ బ్లూ' పటిష్టంగా ఉందన్నాడు.

virat kohli will take challenge from australia for the day/night test..?
'ప్రపంచంలోని ఏ జట్టుతో అయినా డే/నైట్​ టెస్టు ఆడగలం'

ఆస్ట్రేలియాతో జనవరి 14 నుంచి జరగనున్న మూడు వన్డేల సిరీస్​ ముందు కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఈ కార్యక్రమంలో ఆసీస్​తో పింక్​ బాల్​ టెస్టుపైనా పరోక్షంగా స్పందించాడు. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా, ఏ జట్టుపైనైనా డే/నైట్​ మ్యాచ్​లు ఆడే సత్తా టీమిండియా సొంతమని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే గులాబి బంతితో టెస్టు మ్యాచ్​లు ఆడాలని కోహ్లీ, బీసీసీఐని.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు, మాజీలు ఎప్పట్నుంచో కవ్విస్తున్నారు.

ప్రస్తుతం భారత్​ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందన్నాడు. ఆస్ట్రేలియాతో తలపడటం అంటే అత్యుత్తమ జట్టుతో పోటీ అని అభిప్రాయపడ్డాడు విరాట్​. అయితే కచ్చితంగా వారిని ఎదుర్కోగలమని ధీమా వ్యక్తం చేశాడు.

బుమ్రా బౌలింగ్​లో ఔటయ్యా...

ఆస్ట్రేలియాతో సిరీస్​ ముందు బుమ్రా ప్రదర్శనపైనా మాట్లాడాడు కోహ్లీ. ఇద్దరి మధ్య నెట్స్​లో పోటీ ఉంటుదని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.

"నాలుగేళ్లుగా బుమ్రా టీమిండియా తరఫున ఆడుతున్నాడు. అప్పట్నుంచి ఇద్దరి మధ్య స్వేహపూర్వక పోటీ మొదలైంది. నేను అతడి బౌలింగ్​లో ఆడటాన్ని ఇష్టపడతాను. 2018 అడిలైడ్​లో తొలిసారి నన్ను ఔట్​ చేశాడు. మళ్లీ ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీస్​ ముందు ఔట్​ చేశాడు. బుమ్రా మళ్లీ తన ఫామ్​ అందుకోవడం సంతోషంగా ఉంది. అతడు అన్ని ఫార్మాట్లలో నైపుణ్యమున్న ప్రపంచ స్థాయి బౌలర్​. నెట్స్​లోనూ ఆటపై దీక్షగా ఉంటాడు. ఆటగాళ్లకు పదునైన బంతులు వేసి ఇబ్బంది పెట్టడానికి సంకోచించడు".
-- కోహ్లీ, టీమిండియా సారథి

టీ20 ప్రపంచకప్​, టెస్టు ఛాంపియన్​షిప్​ దృష్టిలో పెట్టుకుని జట్టు మెరుగుపర్చుకునే దిశగా అడుగులేస్తున్నామని చెప్పాడు కోహ్లీ.

మంగళవారం నుంచి భారత్​, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్​ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్​ వాంఖడే వేదికగా జరగనుంది. జనవరి 17న రాజ్​కోట్​, 19న బెంగళూరు వేదికగా మ్యాచ్​లు జరగనున్నాయి.

Last Updated : Jan 13, 2020, 4:36 PM IST

ABOUT THE AUTHOR

...view details